BHPL: కాటారం మండలం నస్తూర్‌పల్లి గ్రామంలో ఈనెల 20వ తేదీన రాష్ట్ర CM రేవంత్ రెడ్డి, మంత్రులు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మహాదేవపూర్ మండలం నుంచి కాటారం మండలం వరకు ఉన్న 353 (C) జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను ట్రాక్టర్ల సహాయంతో తొలగించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా రహదారి అంచులను లెవలింగ్ చేయించారు.