SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో దోమల ఎక్కువగా ఉన్నాయన్న సమాచారం అందుకున్న 8వ వార్డు కౌన్సిలర్ ఉదయశ్రీ తక్షణమే స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా హాస్టల్ ప్రాంగణం అంతటా ఈరోజు దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన కౌన్సిలర్‌ను విద్యార్థులు, సిబ్బంది అభినందించారు.