NGKL: ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ సాకర్ కోళ్ల బ్రిడ్జి (ఎల్లికల్ రోడ్) నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో మంజూరైన ఈ పనులను మున్సిపల్ ఛైర్పర్సన్ రత్నమాల, వైస్ ఛైర్మన్ శానవాజ్ ఖాన్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. వంతెన నిర్మాణంతో గ్రామస్తులు, రైతుల రవాణా కష్టాలు తీరనున్నాయని వారు పేర్కొన్నారు.