KRNL: వెల్దుర్తికి చెందిన చిన్నారి పునర్విక మృత్యువును జయించింది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.16 కోట్ల ఇంజెక్షన్ అవసరమైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చూపిన చొరవ ఫలించింది. ఇవాళ హైదరాబాద్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో మంత్రి లోకేష్ సమక్షంలో వైద్యులు అమెరికా నుంచి తెప్పించిన ఇంజెక్షన్‌ను చిన్నారికి విజయవంతంగా ఇచ్చారు.






