E G: రాజానగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం ప్రారంభించారు. అనంతరం పేదలకు ఎమ్మెల్యే అన్నం వడ్డించారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తుందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.