NZB: ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన అమానుష ఘటనలో రెండు నెలల పసికందు మరణించిన ఘటనను ఖండిస్తూ.. తెలంగాణ యూనివర్సిటీ అంబేద్కర్ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీలో ర్యాలీ చేపట్టి పసికందు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఏఐ రాజ్యమేలుతున్న ఈ కాలంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు.