ప్రస్తుత T20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి టోర్నీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆటగాళ్లు సెంచరీలతో రాణిస్తున్నారు. 2010, 2014, 2016 ఎడిషన్స్‌లో అత్యధికంగా రెండేసి సెంచరీలు నమోదు కాగా.. ప్రస్తుత టోర్నీలో ఇప్పటికే 4* నమోదయ్యాయి. ఇంకా 10 మ్యాచులు మిగిలి ఉండటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ లేకపోలేదు.