TG: నీటి హక్కుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నీటిబొట్టును కూడా వదలం అని తెలిపారు. నీటి హక్కుల గురించి మాట్లాడే నైతికహక్కు BRSకు లేదని విమర్శించారు. నీటి హక్కుల విషయంలో BRS చారిత్రాత్మక ద్రోహం చేసిందని ఆరోపించారు. 2028 నాటికి కృష్ణా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.