VZM: విజయనగరం ఆర్మ్డ్ రిజర్వులో ఎఆర్ ఎస్సైగా పని చేస్తున్న వేముల కుమార స్వామి ఆర్ఎస్సైగా ఉద్యోగోన్నతి ఉత్తర్వులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కుమార స్వామికి పదోన్నతి ఉత్తర్వులు అందజేసి, భుజాలకు స్టార్లను స్వయంగా అలంకరించి, శుభాకాంక్షలు తెలిపారు.