TG: ఆసరా పెన్షన్లపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. “కల్లబొల్లి మాటలు జెప్పి పెద్దమనుషులను కూడా మోసం చేసింది కాంగ్రెస్. రూ.2వేలు ఆసరా పెన్షన్లతో అవ్వ- తాతలకు భరోసా నింపింది కేసీఆర్ గారి సర్కార్. కానీ రూ.4వేలు ఇస్తా అని జూటా మాటలు చెప్పి మేమిచ్చిన పింఛన్ కూడా సరిగా ఇవ్వని రేవంత్ సర్కార్ ఇయ్యాల పండు ముసలవ్వలను సైతం రోడ్డు మీదకు తీసుకొచ్చింది. సిగ్గు అనిపించడం లేదా..? మీకు” అంటూ కేటీఆర్ నిలదీశారు.