MNCL: జిల్లాలోని గ్రామాల్లో బెల్టు షాపుల దందాను అరికట్టాలని కోరుతూ సోమవారం ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ లో ఏఓ రాజేశ్వర్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం విక్రయిస్టుండడంతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని తెలిపారు.