PDPL: ధర్మారం మండలం నంది మేడారం తెలంగాణ గురుకుల పాఠశాల & కళాశాల (బాలురు)లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 95% విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని ప్రిన్సిపాల్ విద్యాసాగర్ తెలిపారు. 59 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 56 మంది ఉత్తీర్ణులు అయినట్లు పేర్కొన్నారు. MPCలో ఆడెపు దినేష్ 965 మార్కులు, BIPCలో దార అజయ్ 952 అత్యధిక మార్కులు పొందారని తెలిపారు.