JN: తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని TRP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లబోయిన అశోక్ అన్నారు. జనగామలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో అశోక్ పాల్గొని మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం పలు పార్టీల నేతలు అశోక్ సమక్షంలో TRP పార్టీలో చేరారు.