TG: గాంధీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్న BRS కమిటీని పోలీసులు అడ్డుకోవటంపై మాజీమంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితిని అధ్యయనం చేయటానికి కమిటీ వేశాం. ఆస్పత్రులపై అధ్యయనం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా నిజాలను దాచలేరు. అసలు పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం ఆగదు’ అని తెలిపారు.