PPM: సాలూరు మండలం చిన్నివలస గ్రామం నుంచి కూర్మరాజు పేట-పునికినివలస వెళ్లేందుకు వేసిన రహ దారంతా రాళ్లమయంగా మారింది. ఈ మార్గంలో బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించి ఏడాది దాటినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎర్త్ వర్క్ చేసి వెట్మిక్స్ కూడా వేశారు. ఇక తారువేయాల్సి ఉండగా ఆగిపోయింది.