SDPT: తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలల కథల పోటీల్లో సిద్దిపేట కవి అనిశెట్టి సతీష్ కుమార్ రాసిన ‘అందరూ చేసిందే చేద్దాం’ ఉత్తమ కథగా ఎంపికైంది. 180 కథల్లో పర్యావరణ స్పృహతో కూడిన ఈ కథకు గుర్తింపు రావడం పట్ల కవులు సంతోషం వ్యక్తం చేశారు. బాల సాహిత్యంలో సతీష్ కుమార్ చేస్తున్న కృషిని కొనియాడుతూ పలువురు సాహితీవేత్తలు అభినందించారు.