VZM: బడి ఈడు పిల్లలను, చదువుతూ మధ్యలో బడి మానేసిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గంట్యాడ MPDO రమణమూర్తి సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్న బడి పిలుస్తోంది కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులతో ప్రభుత్వ పాఠశాలలలో వారి పిల్లలకు కలిగే ప్రయోజనాలు వివరించాలన్నారు.