కృష్ణా: జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి రికార్డు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చాలని ఎస్పీ గంగాధర్ రావు అన్నారు. SHOలు తమ సిబ్బందితో కలిసి స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. అప్డేట్ చేయడం ద్వారా పెండింగ్ కేసులలో బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు.