ELR: సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీల మధ్య ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు పాల్గొని కేకు కట్ చేసి సంబరాలు జరిపారు. చంద్రబాబు సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అనేక మార్పులను వివరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.