AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. రేపు భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 22న ఉదయం పులివెందుల నుంచి లింగాల మండలం ఇప్పట్ల వెళ్తారు. 23న ఉదయం పర్యటన ముగించుకుని తిరుగు పయనమవుతారు.