ELR: కొయ్యలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు పారేపల్లి రామారావు ఆధ్వర్యంలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని బయ్యనగూడెం గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులకు స్వీట్లు, మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది.