సత్యసాయి: సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. బాబు అపార అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి దిక్సూచి వంటివని ఆయన కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం పడుతున్న తపన అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా వెలగాలని మంత్రి ఆ భగవంతుడిని ప్రార్థించారు.