కాకినాడ: కరప సొసైటీలో రూ.75వేల ఎరువుల స్టాక్ మాయమవ్వడంపై అధికారులు విచారణ జరిపారు. ఆ మొత్తాన్ని కిందిస్థాయి సిబ్బందితో రికవరీ చేయించి చేతులు దులుపుకున్నారు. అయితే, అసలు బాధ్యులైన పెద్దలపై చర్యలు తీసుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. సొమ్ము కడితే అక్రమాలు మాఫీ అవుతాయా అని వారు ప్రశ్నిస్తున్నారు.