HNK: వేలేరు మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన సీపీఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్ది విశ్వనాథం కుటుంబ సభ్యులను ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాడికొండ రాజయ్య పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి తెలంగాణ ఉద్యమంలో విశ్వనాథం చూపిన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. కర్ర సోమిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.