శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో వామపక్షవాద నేత అసుర కుమారా దిసనాయకే విజయం సాధించారు. జనతా విముక్తి పెరమున పార్టీకి చెందిన అనుర కుమార రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపొందారు. ఎన్నికల్లో విజయంతో శ్రీలంక 9వ అధ్యక్షునిగా అనుర కుమార ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొత్తం పోలైన ఓట్లలో 42.31 శాతం ఓట్లు అనుర కుమార సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.