JGL: పెగడపల్లి మండల కేంద్రంలో పోలీసులు దాడులు నిర్వహించి ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో గుడుంబా విక్రయిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఈ సోదాలు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పేర్కొన్నారు.