BDK: ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం పాత కొత్తగూడెం హనుమాన్ బస్తీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీని కలెక్టర్ అంకిత్ ఘనంగా ప్రారంభించారు.“రహదారుల భద్రత మన అందరి బాధ్యత” అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ రహదారుల భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.