MDK: రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను కలెక్టర్ ప్రతిమా సింగ్ సన్మానించారు. తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులను మెమెంటో, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని గొప్పగా నిర్దేశించుకుని ముందుకు సాగాలని కోరారు.