ATP: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అనంతపురంలో BJP మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్య పాల్గొన్నారు.