GDWL: అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా అలంపూర్ చౌరస్తాలో ఉండవల్లి ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో గురుకుల విద్యార్థులతో రోడ్డు భద్రతా ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.