AP: ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘తిరుమలలో లడ్డూలతో పాటు వంటలకూ ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటి పనులు ఏ పాలకులు చేయలేదు. జగన్ తన వాళ్లకు, అన్యమతస్తులకు ప్రాధాన్యత ఇచ్చారు. టెండర్లలో నెయ్యి సరఫరాకు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. మూడేళ్ళలో ఒక ఏడాది రూ.250 కోట్ల టర్నోవర్ ఉండాలి. రూ.250 కోట్ల టర్నోవర్ లేకున్నా.. జగన్ తన వాళ్లకు డెయిరీ పెట్టిన ఏడాదిలోనే కాంట్రాక్టు ఇచ్చారు’ అని తెలిపారు.