ప్రకాశం: అద్దంకి మండలం అద్దంకి కి చెందిన గోపిశెట్టి అనూష తన భర్త అనిల్ కుమార్, అత్త రమణమ్మలు అదనపు కట్నం తీసుకురావాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు అద్దంకి సీఐ కృష్ణయ్య తెలియజేశారు. ఈమెకు 11 సంవత్సరాల క్రితం ఒంగోలుకు చెందిన అనిల్ కుమార్తో వివాహమైనట్లు సీఐ పేర్కొన్నారు.