W.G: ఆకివీడు మండలం అజ్జమూరు ఎంపీపీ పాఠశాల ఆధ్వర్యంలో ఆదివారం ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్ఎం ఆర్విఎస్ నారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు ఉంటున్నాయని వివరించారు.