AKP: నవోదయ ఎంట్రన్స్ ఫలితాల్లో నర్సీపట్నం విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సాధించిన ఎస్.ఆర్.ఆర్ ఠాగూర్‌ను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. ఠాగూర్‌తో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్.జయ కార్తీక్, బి.చేతన్, కార్తికేయలను కూడా ఆయన అభినందించారు.