KMM: ఎర్రుపాలెం మండలం మారుమూల రెవెన్యూ పరిధిలోని నరసింహాపురంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తోలకాలు చేస్తున్న రెండు టిప్పర్ లారీలను తహసీల్దార్ ఉషా శారద పట్టుకున్నట్లు ఆదివారం వెల్లడించారు. అనంతరం ఆ టిప్పర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు వెల్లడించారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.