HNK: పరకాల పట్టణంలోని పలు ఫంక్షన్ హాల్స్‌లో అగ్ని ప్రమాదాల నివారణపై ఫైర్ స్టేషన్ సిబ్బంది అవగాహన కల్పించారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భద్రయ్య మాట్లాడుతూ… అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆదిలోనే మంటలను ఆర్పేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని, అత్యవసర సమయాల్లో వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, అగ్ని ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.