ప్రకాశం: అద్దంకి మండలం సింగరకొండ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు రాతి ముఖమండపం నిర్మాణానికి ఆదివారం నెల్లూరు జిల్లాకు చెందిన చుండూరి సుబ్బారావు 1,00,000 రూపాయలను విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు విరాళం అందించిన సుబ్బారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని కొనియాడారు.