NZB: ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారి వేధింపులు భరించలేక NZB డివిజన్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తనఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కమిషనర్ అందరి ముందు దుర్భాషలాడారని, అవమానాన్నితట్టుకోలేక, ఆత్మాభిమానం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. చైతన్యం చచ్చిపోయిన ఈ శాఖలో 30 ఏళ్లు పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానని భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు.