AP: విజయవాడలో నిర్వహించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఏచూరి ఒక మేధావి. గొప్ప రచయిత. ఉత్తమ పార్లమెంటేరియన్.ఏచూరికి కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉంది. 2004లో UPA ప్రభుత్వం ఏర్పాటుకి, ప్రభుత్వం నిలబడటానికి ఆయన ఎంతో కృషి చేశారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. బీజేపీ మీద చేసిన ఆయన పోరాటం మాకు స్ఫూర్తి.’ అని తెలిపారు.