AP: NTR జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారుపై ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ క్రమంలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.