SDPT: వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామ సర్పంచ్ నేరెళ్ల వెంకటలక్ష్మి తెలిపారు. గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్ద శనివారం కొత్త బోరు మోటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.