AP: మాల్యాల హంద్రీనీవా పంప్ హౌజ్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గత వైసీపీ ప్రభుత్వం హంద్రీనీవాను నిర్లక్ష్యం చేసింది. రాయలసీమకు జగన్ అన్యాయం చేశారు. ఆయన నిర్లక్ష్యంతోనే విజయవాడకు వరదలు వచ్చాయి. సీఎం చంద్రబాబు పరిస్థితులను చక్కబెట్టి ప్రజాపాలన ఎలా ఉంటుందో చూపించారు. ఇప్పటి నుంచి నెలలో రెండు సార్లు రాయలసీమ ప్రాజెక్టులను సందర్శిస్తాను. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం’ అని అన్నారు.