BDK: బూర్గంపాడు మండలం రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో నూతన కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రారంభించి మాట్లాడుతూ.. విద్యార్థినుల కోసం మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.