వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2028 ఏప్రిల్ నుంచి కొత్త పెట్రోల్ టూ-వీలర్ల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేయనుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు భారీ రాయితీలు, ట్యాక్స్ మినహాయింపులు ప్రకటించింది. 2030 నాటికి దేశ రాజధానిని పూర్తిస్థాయి ఈవీ నగరంగా మార్చడమే లక్ష్యంగా ఈ కొత్త పాలసీని రూపొందించింది.