వచ్చే వారం CBSE పదో తరగతి(సెషన్-1) ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా పరీక్షలకు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఈ ఏడాది నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించాలని CBSE నిర్ణయించింది. మొదటి సెషన్ కంపల్సరీ కాగా పర్ఫార్మెన్స్ పెంచుకునేందుకు రెండో సెషన్ రాయొచ్చు. MAY 15 నుంచి JUNE 1 వరకు 2వ సెషన్ పరీక్షలు జరగనున్నాయి.