TG: ఆదిత్య కన్స్ట్రక్షన్ కార్యాలయంపై సిట్ పోలీసులు దాడి చేశారు. తనను రూ.29 కోట్ల మేర మోసం చేశారంటూ తోట చంద్రశేఖర్‌పై వాకాడ తిరుమల్‌రావు ఫిర్యాదు చేశారు. బిల్లులు ఇవ్వకుండా తనను బెదిరిస్తున్నారని, డబ్బులు అడిగినందుకు బౌన్సర్లతో దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తోట చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రశేఖర్‌తోపాటు మరో ఆరుగురిని నిందితులుగా చేర్చారు.