NLG: పెండింగ్లో ఉన్న రూ. 9000 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇవాళ భిక్షాటన నిర్వహించారు. నగర సంయుక్త కార్యదర్శి శివ చరణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో సిద్దు, శివ, పరమేష్ పాల్గొన్నారు.