TG: మహిళా ఉద్యోగుల రక్షణకు రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమలులో భాగంగా.. తెలంగాణ సచివాలయ సాధారణ పరిపాలన శాఖలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.