AP: విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులను రెండోరోజు కస్టడీ విచారణ చేయనున్నారు. మరోవైపు ఈ కేసును తమకు అప్పగించాలని పోలీస్ కమిషనర్‌కు విశాఖ NIA అధికారులు లేఖ రాశారు. కేసు విచారణ ఏడు రాష్ట్రాలతో ముడి ఉన్నందున తాము దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఏడుగురు నిందితుల విచారణ అనంతరం NIAకు అప్పగించే అవకాశం ఉంది.