KNR: హుజురాబాద్ సబ్ జైలులో ఖైదీలు, సిబ్బందికి గురువారం డిప్యూటీ DMHO శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు, ఛాతి ఎక్స్రేలు, రక్త పరీక్షలు చేపట్టి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. అలాగే వ్యాధి నిరోధక శక్తిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డా.రవీందర్ రెడ్డి, డా. తులసీదాస్, డా. జరినా, ఐసీటీసీ హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.